ఓవైపు థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్ లేని కూటమి వేస్ట్ అని తేల్చేశారు వీ హనుమంతరావు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ తో ఉన్న పార్టీలు బలపడితేనే ఫ్రంట్ సాధ్యమని స్పష్టం చేశారు. బలమైన తమ పార్టీ ఉంటేనే అది సాధ్యం అవుతుందని చెప్పారు.
సంజయ్ రౌత్ మంచిగా మాట్లాడారన్న వీహెచ్.. నేడో రేపో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ తోనే వస్తారని అన్నారు. హస్తం పార్టీ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఉండదని.. ఇతర పార్టీలు అన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేయలేవని చెప్పారు.
ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే.. కాంగ్రెస్ లేని కూటమితో పని కాదని అంటున్నారు హస్తం నేతలు. అదే విషయాన్ని ప్రస్తావించారు వీహెచ్.
ఇటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు జైలు శిక్ష విధించడంపై స్పందించిన వీహెచ్.. ఓబీసీ వర్గానికి చెందిన ఆయనకు జైలుశిక్ష పడడం తనను బాధించిందన్నారు. మోడీకి లొంగలేదు కాబట్టే లాలూ జైలుకు వెళ్లారని విమర్శించారు.