రాజ్యాంగం అమలు అయినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హెచ్. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రాసే బాధ్యతను ఒక దళిత మేధావి అంబేడ్కర్ కు అవకాశం ఇచ్చిందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం పంజాగుట్ట వద్ద ఏర్పాటు కోసం నేను ప్రయత్నం చేస్తే దాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారన్నారు. మూడేళ్లు అయింది ఇంతవరకు అంబేడ్కర్ విగ్రహం ఇవ్వలేదు.
స్పీకర్ కు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి లకు ఢిల్లీ పెద్దలకు లేఖలు కూడా రాశాను. వెంటనే విగ్రహం ఏర్పాటు కోసం చర్యలు చేపట్టకపోతే
డిసెంబర్ 12న జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగుతా అని హెచ్చరించారు వి హెచ్. ప్రాణం పోయినా సరే అంబేడ్కర్ విగ్రహం కోసం పోరాటం చేస్తానన్నారు. ఆ తరువాత విగ్రహం ఏర్పాటు చేయాలని కంటతడి పెట్టుకుని ఎమోషన్ అయ్యారు.