కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తన ట్విట్టర్ బయోడేటాలో ఓ క్యాప్షన్ యాడ్ చేశారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా పని చేస్తున్నట్టు(కరెంట్లీ వర్కింగ్ యాజ్ హోం గార్డ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ)అని యాడ్ చేశారు. ఇప్పుడు దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
దీంతో హన్మంతన్న జోకులు చేస్తున్నారంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇది ఇలా వుంటే కాంగ్రెస్ నేతల్లో గత కొంత కాలంగా అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తానొక హోంగార్డ్‌ను మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ప్రచారానికి హోం గార్డులు వెల్లరని కేవలం ఎస్పీ స్థాయి వారు మాత్రమే వెళతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు టీకాంగ్రెస్‌లో పెద్ద దుమారం రేపాయి. మరోవైపు ఇటీవల మర్రి శశిధర్ రెడ్ది కూడా పార్టీని వీడారు.
ఆయన పార్టీని వీడే సమయంలో… ఒక హోంగార్డుగా పార్టీ నుంచి తాను వెళ్లిపోతున్నట్లు ఆయన తెలిపారు.దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వి.హనుంతరావు తన బయోలో ఇలా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.