రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. అలాంటి వ్యక్తి ఎవరో తిట్టారని సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీఆర్ఎస్ నేతలు కోవర్ట్ రెడ్డి అనడం బాధ కలిగించిందన్నారు.
అధికార పార్టీ నాయకులతో ఇంటి పేరును కూడా మార్చేసి ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.వెంకట్ రెడ్డి స్టార్ కంపెనీయర్ గా ఉండి ప్రచారం చేయకపోతే మీకే చెడ్డ పేరు వస్తుందని సూచించారు. పార్టీలో నాక్కూడా అవమానాలు జరిగాయి కానీ కాంగ్రెస్ జెండాను వదిలిపెట్టలేదన్నారు.
ఒరిజినల్ కాంగ్రెస్ అని చెబుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండకూదన్నారు. మునుగోడులో ప్రచారం చేసి ఓటు అడగకపోతే కోమటిరెడ్డికి చెడ్డ పేరు వస్తుందన్నారు వి. హనుమంతరావు.రైతుల సమస్యలపై రేవంత్ రెడ్డితో కలిసి ఉద్యమించిన నీవు యూనిటీని దెబ్బతీయద్దన్నారు.
మునుగోడు ఉపఎన్నిక అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు.. కానీ ప్రచారం చేయకుండా విదేశాలకెళితే ఎన్నారైలంతా నిన్ను ప్రశ్నిస్తారని అన్నారు. సోనియా గాంధీ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొందని..సోనియాగాంధీ అంత చేస్తుంటే మనం ఇంకెంత చేయాలో ఆలోచించాలని అన్నారు.