బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డా.బీఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. అగ్ర కులాల వారితో పాటు దళితులకు సమాన హక్కులు కల్పించాలని అంబేద్కర్ రాజ్యంగాన్ని నిర్మించారని ఆయన కొనియాడారు. 2019లో హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ జన్మదినం రోజునే ఆయన విగ్రహాన్ని కూలిస్తే ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఏపీలో వైఎస్సార్ విగ్రహం పెట్టిన ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్రించారు. అంబేద్కర్ ఆశయ సాదన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ వర్దంతి సంధర్బంగా విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు వీహెచ్.