రజాకార్ల వారసత్వం నుండి పుట్టుకొచ్చిన ఎంఐఎం పార్టీని నిషేధించాలన్నారు వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్. తెలంగాణ తాలిబన్లు రజాకార్లు సాగించిన ఆనాటి అకృత్యాలను ఈ సమాజం ఎన్నటికీ మరచిపోదని చెప్పారాయన. నిజాం రాక్షస పాలన నేటి పాలకులకు ఆదర్శంగా కనబడటం సిగ్గుచేటని విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇక 1948 ఆగస్టు 27న తెలంగాణ జలియన్ వాలాబాగ్ వీర భైరాన్ పల్లి మారణహోమంలో అసువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు శిశిధర్.