భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని భక్తులు ఈ సంవత్సరం కూడ ఘనంగా నిర్వహిస్తారన్నారు VHP అధికార ప్రతినిధి రావినూతల శశిధర్. హైకోర్టు ముందు వాస్తవ విషయాలు ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని… ప్రభుత్వం సరైన వాదనలు వినిపించడంలో నిర్లక్ష్యం వహించిందని అన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం పై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వానిదని అన్నారు. సరైన న్యాయపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
హిందువుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు గౌరవించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు శశిధర్.
రోజువారి కాలుష్యాన్ని నివారించలేని వివిధ ప్రభుత్వ విభాగాలు తమ అవినీతిని,అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి గణపతి ఉత్సవాలపై విషప్రచారం చేస్తున్నాయన్నారు.