న్యూఢిల్లీ : ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా కోడెల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. స్పీకర్‌గా కోడెల సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని గవర్నర్ పేర్కొన్నారు.
కోడెల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమని, ఆయన మరణం విషాదకరమని పేర్కొన్నారు. కోడెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల శివప్రసాదరావు తుది శ్వాస విడవటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోపణలు, విమర్శలపై రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదని, కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్ననని అన్నారు.