అవినీతి నియంత్రణలో దేశం పురోగభివృద్ధి వైపు పయనిస్తోందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుల కలలను మనం సాకారం చేయాల్సి వుందన్నారు. ప్రజలంతా ‘సబ్‌కా ప్రయాస్- సబ్‌కా కర్తవ్య్’ నినాదంతో మరింత ముందుకు వెళ్లాలని సూచించారు.
అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ మనం మరింత వేగవంతంగా పనిచేయాలని అన్నారు. భారత సైనికుల శౌర్యానికి గుర్తుగా విజయ్ దివస్ ను రేపు జరుపుకుంటున్నామని చెప్పారు.
అభివద్ధి అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. దాని కోసం స్థిరమైన జీవన విధానం చాలా అవసరమని వివరించారు. అటవీ సంపద, నీటి వనరుల ప్రాధాన్యం అందరూ గుర్తించాలన్నారు. ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.