మేడ్చల్ జిల్లా బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఆదివారం వక్ఫ్ బోర్డు బాధితులు ఐక్య కార్యాచరణ సమితి అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కార్పొరేషన్ లోని దాదాపు నాలుగు వందల ఎకరాల్లో తొంబైశాతంకు పైగా నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఈ సర్వే నెంబర్లలో గత నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ఐక్య కార్యాచరణ సమితి అధ్వర్యంలో గత అనేక రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులు సైతం రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేయాల్సి వచ్చిందని వాపోయారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త కిషోర్ గౌడ్ హెచ్చరించారు.