ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె నాంపల్లి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. విజయశాంతి 1998 జనవరి 26న రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదట్లో ఆమె బీజేపీలో చేరారు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు.
2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు.
2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. అక్కడా ఇమడలేకపోయారు. 2020లో విజయశాంతి మళ్లీ బీజేపీ గూటికే చేరారు.