శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ లుక్ లో విక్టరీ వెంకటేష్ పక్కా మాస్ యాంగిల్ లో కనిపించారు.
ఇక ఆదివారం విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి గ్లింప్స్ ఆఫ్ నారప్ప ను విడుదల చేశారు. అంతకు ముందు కొన్ని గంటల క్రితమే సరికొత్త స్టయిలిష్ లుక్‌లో వెంకటేశ్ దిగిన లేటెస్ట్ స్టిల్స్ విడుదలయ్యాయి. వెంకీ తరువాత సినిమాలో ఈ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.మరోవైపు ఎఫ్ 2కి సీక్వెల్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 ని కూడా వెంకీ తెరకెక్కించబోతున్నాడు. పుట్టినరోజు సందర్భంగా ఎఫ్ 3 గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం అని వెంకీ వాయిస్‌లో… నవ్వుకోవడాకి మీరు కూడా థియేటర్స్‌కు వస్తారుగా అని వరుణ్‌తేజ్ వాయిస్‌లో డైలాగ్స్‌తో పాటు అంతేగా ..అంతేగా..అనే డైలాగ్‌తో ఉన్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.