తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ సూపర్ అని చెప్పవచ్చు. గత ఏడాది ‘ఎఫ్ 3’ మూవీతో హిట్ కొట్టిన ఆయన.. తాజాగా మరో మూవీ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఆ సినిమా టైటిల్ ని ప్రకటించింది మూవీ యూనిట్. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర టైటిల్ ని, ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు.
వెంకీ రఫ్ లుక్ లో.. గన్ పట్టుకున్న తీరు చూస్తుంటేనే, ఇది భారీ యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేష్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇదిలా ఉంటే ఇది వెంకటేష్‌కి 75వ చిత్రం కావడం విశేషం.