సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. తన బాడీ లాంగ్వేజీకి తగ్గ పాత్రలను చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో తాను చేస్తోన్న క్యారెక్టర్ కు అధిక ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు వెంకటేష్. సినిమా విజయంలో కూడా తన పాత్ర ఉందనిపించుకునేలా ఆయన సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే ఎఫ్ 2. ఈ సినిమాలో వెంకటేష్ ప్రధాన పాత్రలో కనిపించి ఆడియన్స్ ను బాగా అలరించాడు. ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎఫ్ 2కు సీక్వెల్ గా ఎఫ్ 3 ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమా కోసం వెంకటేష్ కు మునుపటి సినిమా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలా లేక సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలా? అనే విషయంలో ‘దిల్’ రాజు తన నిర్ణయం చెప్పాల్సి ఉందట. దాంతో ఆయన ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విక్టరీ వెంకటేష్ కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ మరోసారి దక్కనున్నట్లు తెలుస్తోంది.