మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పకప్పుడు ఆసక్తికరమైన, ఇన్ స్పైరింగ్ వీడియోలు పెడుతుంటారు. తాజాగా ఆయన మరో ఇంటరెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆర్బీఐ బోర్డు సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఆ సమావేశంలో ఆనందర్ మహీంద్రా పాల్గొన్నారు. భారత డిజిటల్ కరెన్సీ ఈ రూపీ గురించి సమావేశంలో ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన బయటకు వచ్చి రోడ్డుపై వున్న ఓ పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్లారు.
డిజిటల్ రూపీని ఉపయోగించి ఆయన దానిమ్మ పండ్లను కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దానికి గాట్ గ్రేట్ పోమో గ్రనేట్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
డిజిటల్ కరెన్సీ గురించి ఆర్బీఐ బోర్డు సమావేశంలో పూర్తిగా తెలుసుకున్నానని చెప్పారు. మీటింగ్ నుంచి బయటికి వచ్చాక రోడ్డుపై ఉన్న పండ్ల వ్యాపారి బచ్చేలాల్ సహాని దగ్గరికి వెళ్లి పండ్లు కొన్నట్టు చెప్పారు. దాంతో ఈ-రూపీని యాక్సెప్ట్ చేసిన మొదటి వ్యాపారుల్లో బచ్చేలాల్ ఒకరయ్యారని అని ఆయన పేర్కొన్నారు.