మూడో వన్డేలో భారత ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ విసిరిన 260 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 42 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. దీంతో 2-1 తేడాతో సిరిస్ ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. రిషబ్ పంత్ 113 బంతుల్లో 125 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 55 బంతుల్లో 71 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ లో అధ్బుతమైన ఆటతీరును కనబరిచి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డును టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రీకి గిఫ్ట్ గా ఇస్తున్నట్టు రిషబ్ పంత్ ప్రకటించారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మాజీ కోచ్ రవిశాస్త్రీ వద్దకు పంత్ వెళ్లి బాటిల్ అందిస్తూ కనిపించారు. దీంతో అక్కడ ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున అరుస్తూ, చప్పట్లు కొట్టారు.