ఒకప్పుడు పెండ్లి వేడుకల్లో డీజే సౌండ్స్, తీన్ మార్ స్టెప్పులు, హంగామా ఉండేవి. కానీ ఇటీవల ఆ కల్చర్ మారుతోంది. పెండ్లి బరాత్ లల్లో ఇటీవల తుపాకులు, కత్తులతో డ్యాన్స్ లు చేస్తూ హంగామా సృష్టిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము.
తాజాగా అలాంటి ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో అతిథుల కోసం డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ ఫీమేల్ డ్యాన్సర్ ను తీసుకు వచ్చారు. ఆమె డ్యాన్స్ చేస్తుండగా చూస్తూ ఆనందిస్తున్నారు.
ఇంతలో ఓ యువకుడు స్టేజిపైకి వచ్చాడు. చేతులో తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. వేళ్లను ట్రిగ్గర్ పై పెట్టి డ్యాన్సర్ గర్ల్ కు గురిపెట్టి డ్యాన్స్ చేశాడు. దీంతో అది ఏ సమయంలో పేలుతుందో తెలియక అందరూ హైరానా పడ్డారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అది ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ కంట పడింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. కల్చర్ పక్కతోవ పడుతోందన్నారు. ఆ యువకున్ని గుర్తించి అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి ఆయన ఆదేశాలు జారీ చేశాడు.