ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్ శ్మశాన వాటికను తలిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రష్యా విధ్వంసం తాలుకు చిత్రాలే కనిపిస్తున్నాయి.
తాజాగా ఉక్రెయిన్ పౌరులు ప్రయాణిస్తున్న ఓ కారుపై రష్యా యుద్ద ట్యాంకర్లు బాంబు దాడులు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
వీడియోలో కనిపిస్తున్న వివరాల ప్రకారం… ఉక్రెయిన్ లోని ఓ జంక్షన్ లో రష్యా యుద్ద ట్యాంకులను చూసి మెరూన్ కలర్ సెడాన్ కారు రోడ్డు ఎడమ వైపు ఆగింది. ఇంతలో ఆ కారుపై యుద్దట్యాంకు బాంబు దాడి చేసింది.
ఇంతలో కారులో ఉన్న వ్యక్తులకు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. దాని నుంచి తేరుకునే లోపే కారుపై మరో సారి బాంబు దాడి చేసింది. దీంతో కారులో ఉన్న భార్య, భర్తలు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు.