డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు హమారా ప్రసాద్. అంబేద్కర్ రాసిన పుస్తకం రిడిల్స్ ఆఫ్ హిందూయిజం పుస్తకం కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందంటూ మండిపడ్డాడు.
అంబేద్కర్ బతికి ఉన్న కాలంలో తాను ఉండి వుంటే గాంధీని గాడ్సే కాల్చి చంపినట్టు తాను కూడా ఆయన్ను చంపే వాడినంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలను విడతల వారీగా యూట్యూబ్ లో పెట్టాడు హమారా ప్రసాద్.
ఇతని వ్యాఖ్యలపై దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో సమాజంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
ప్రసాద్ వ్యాఖ్యలపై పలు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు. ట్విట్టర్ లో బీఆర్ఎస్ ను ట్యాగ్ చేస్తూ ప్రసాద్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అల్వాల్ లో హమారా ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.