బాలయ్యతో విద్యాబాలన్ ఫిక్స్

ఎన్టీయార్ బయోపిక్ స్పీడందుకుంది. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నందమూరి బాలకృష్ణ షూటింగ్ షెడ్యూల్ మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు కాస్టింగ్ విషయంలో కూడా బాలయ్య వెనక్కు తగ్గడం లేదు. ఇందులో బాలకృష్ణ ఎన్టీఆర్ గా 62 గెటప్స్ తో కనిపించనున్నారు. తేజా డైరెక్ట్ చేస్తున్న ‘ఎన్టీయార్’ మూవీ.. నటీనటుల ఎంపిక విషయంలో కొద్దికొద్దిగా ప్రోగ్రెస్ చూపెడుతోంది.

తాజాగా.. సీనియర్ ఎన్టీయార్ సతీమణి బసవతారకం రోల్ కోసం ఒక బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వెర్సటైల్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ గా పేరున్న విద్యాబాలన్ ‘ఎన్టీయార్’ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ చేయడం దాదాపుగా ఖరారైనట్లే. ఎన్టీయార్ వ్యక్తిగత జీవితంలో అత్యంత ప్రాధాన్యమున్న ‘బసవతారకం’ పాత్రకు విద్యాబాలన్ పూర్తి న్యాయం చేస్తుందని బాలయ్య భావిస్తున్నారు. డైరెక్టర్ తేజ కూడా ఈ సెలక్షన్ ని ఓకె చేసినట్లు సమాచారం.