ముంబయి: ‘ఒక డైరెక్టర్ నన్ను రూమ్‌లోకి రమ్మని పిలిచి వెకిలిగా ప్రవర్తించాడు.. చాలామందిలాగే నేను కూడా నా సినీ ప్రయాణంలో ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నా..’ అంటూ ప్రముఖ నటి విద్యాబాలన్ తనకు ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘మిషన్ మంగళ్’ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాబాలన్ ఈ దురదృష్టకరమైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. నాకు బాగా గుర్తు.. అతను దక్షిణాది పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్. నేను చెన్నైలో ఉన్నాను. ఆ డైరెక్టర్ వచ్చి మీతో మాట్లాడాలి రూమ్‌లోకి వెళ్దాం అన్నాడు. కాఫీ షాప్‌లో కూర్చొని మాట్లాడుకుందాం అంటే అతను ఒప్పుకోలేదు. తీరా హోటల్ రూంలోకి వెళ్తే.. అతను వెంటనే రూమ్ తలుపులు వేసేసి నాతో వెకిలిగా ప్రవర్తించాడు. కోపం వచ్చి గట్టిగా అరిచాను. తలుపు తీసి వెళ్లిపొమ్మన్నట్టు తీక్షణంగా చూశాను. దాంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని విద్య చెప్పారు. ‘కెరీర్ ఆరంభంలో నా తల్లిదండ్రులతో కలిసి సినీ అవకాశాల కోసం ఓ నిర్మాతను కలుద్దామని వెళ్తే.. ఆయన నన్ను చూసి నీది అసలు హీరోయిన్ ముఖమేనా అన్నార’ని విద్యాబాలన్ చెప్పారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » రూమ్‌కి తీసుకెళ్లి వెధవ పని చేయబోయాడు