హైదరాబాద్ : గవర్నర్ల నియామకాల్లో తెలంగాణ బాగా హైలైట్ అయ్యింది. ఈ రాష్ట్రానికి సంబంధించిన నలుగురి పేర్లు ఈ నియామకాల్లో చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇద్దరైతే ప్రత్యక్షంగా తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయను హిమాచల్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా వున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యాసాగరరావును అక్కడి నుంచి తప్పించారు. ఆయనకు మరెక్కడా అవకాశం ఇవ్వలేదు. మరో రాష్ట్రానికి విద్యాసాగరరావుని పంపించే ఉద్దేశ్యం కూడా లేనట్టు కనిపిస్తోందని సమాచారం.
ఇక, తెలంగాణాకు తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. ఆమె తమిళనాట పార్టీకి చేసిన సేవలకు గాను దక్కిన బహుమతి ఇది. అలాగే, తొలి మహిళా గవర్నర్ నియామకం కూడా. ఇక, తప్పించిన ఇప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన నరసింహన్‌కు మరెక్కడా పొస్టింగ్ ఇవ్వలేదు.