మొన్న యాదాద్రి… ఇప్పుడు యాదగిరి… సాములోళ్ల బూతు పురాణాలు ఎక్కువయిపోతున్నాయి. యాదాద్రి గుడిలో బూతు బొమ్మలు పెట్టించాలన్న ఓ సాములోరి అత్యుత్సాహాన్ని మరచిపోకముందే బెంగళూరులో మరో సాములోరు ఓ అమ్మాయితో గుట్టుచప్పుడు కాకుండా రొమాంటిక్ ట్రాక్ నడిపించాలనుకుని అడ్డంగా బుక్కయిపోయాడు..
బెంగుళూరు: స్వామిజీల బూతు వ్యవహారాలు మనకు కొత్తమీ కాకపోయినా ప్రతిష్టాత్మకమైన యాదగిరి జిల్లా కణ్వమఠం స్వామిజీ విద్యావారది తీర్థ ఓ యువతితో ప్రేమ సంభాషణలు నడపడం సంచలనం సృష్టించాయి. హాట్ హాట్ డిస్కషన్స్‌తో అక్కడ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. బుధవారం విద్యావారది తీర్థ ఓ యువతితో సన్నిహితంగా మాట్లాడటం అక్కడ టాక్ ఆఫ్ ద స్టేట్ అయ్యి కూర్చుంది. ఇద్దరం పరస్పరం సహకరించుకుందామని చెప్పి, ఎవరికీ డౌటు రాకుండా భక్తురాలి రూపంలో రావాలని స్వామివారు చేసిన సంభాషణలు వైరల్ అయ్యాయి. తరచూ మఠానికి వచ్చే ఓ యువతితో మఠాధిపతికి ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారిందని చెబుతున్నారు.

స్వామిజీకి సన్నిహితంగా ఉండేవారే కుట్రకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే యువతి వెనుక భారీ కుట్ర ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సప్ చాట్‌లో ఫోటోలు చూపకుండానే యువతి జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత స్వామిజీకి కోటి రూపాయల డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. ఐతే తనపై వచ్చిన ఆరోపణలు తేలేవరకు మఠాధిపతిగా కొనసాగనని ధ్యానంలో వెళ్తానని విద్యావారదితీర్థ ప్రకటించారు.
సాములోరి బూతు సంభాషణలు బెంగళూరులోని ప్రసార మాధ్యమాలన్నీ బట్టబయలు చేశాయి.