విశాఖపట్నం జిల్లాలో డిపార్ట్ మెంటల్ స్టోర్ డీ మార్ట్ కొత్త రకం దోపిడీకి తెర తీసింది. వినియోగదారులు అప్రమత్తం కావడంతో వారి గుట్టు రట్టయ్యింది. విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం డీ మార్ట్ లో ఒరిజినల్ ఎమ్మార్పీ స్టిక్కర్లను తొలగించి వాటి స్థానంలో ఎక్కువ ధర ఉన్న ఎమ్మార్పీ స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఇది గమనించిన వినియోగదారులు కొందరు తూనికలు, కొలతలు శాఖకు ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతలు శాఖాధికారులు డీ మార్ట్ లో తనిఖీలు నిర్వహించగా…ఒరిజినల్ స్టిక్కర్లను తొలగించి ఎక్కువ ధరతో స్టిక్కర్లను వేసిన మాట నిజమేనని గుర్తించారు. మర్రిపాలెం డీ మార్ట్ ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్ కు భారీ జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1,18,000 చెల్లించాలని నోటీసు లిచ్చారు.