సెలబ్రిటీ న్యూ కపుల్ నయనతార, విగ్నేశ్ శివన్ సరోగసి ద్వారా ఇద్దరి కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని నయన్, విఘ్నేశ్ స్వయంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పోస్ట్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను కూడా విగ్నేశ్ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నయనతార సరోగసి అంశంపై ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది.
ఈ అంశంపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం కూడా రియాక్ట్ అయ్యారు. సరోగసికి సబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. తమకి పిల్లలు ఎలా పుట్టారో నయన తార వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటి వరకూ ఈ జంట వీటిపై స్పందించలేదు.
తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకూ ఓపికపట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి అంటూ అందులో పేర్కొన్నారు విఘ్నేశ్. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతంది. సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిన నయన్ దంపతులు ఈ విషయంపై నేరుగా స్పందించకుండా ఇలా పరోక్షంగా స్పందించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా చాలా కాలంగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్ పూర్తయ్యాక కొన్ని రోజుల్లోనే ఈ ఇద్దరూ తమ తమ సినిమాల షెడ్యూల్‌తో బిజీగా అయిపోయారు. నెల రోజులకు పైగానే వీరిద్దరూ దుబాయ్ వెళ్లి హనీమూన్ చేసుకున్నారు.