సాధారణంగా సినిమా హీరోయిన్స్ తమ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుందకునే టైమ్ లో ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోతారు. కానీ హీరోయిన్స్ పొలిటికల్ లీడర్స్ ని పెళ్ళి చేసుకోవడమనేది అత్యంత అరుదు.కానీ బాలీవుడ్ లో ఓహీరోయిన్ కీ, యంగ్ పొలిటికల్ లీడర్ కీ లవ్వు కుదిరింది.
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు, ముంబయికి చెందిన పొలిటికల్ లీడర్ ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. అయితే తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని చాలా ఆలస్యంగా అభిమానులకు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో తమ వివాహం అయినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
తమ మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసే ఓ ప్రత్యేకమైన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన ప్రయాణాన్ని ఈ వీడియోలో చూపించారు. జనవరి 6న ముంబయి రిజిస్ట్రార్ కార్యాలయంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సమర్పించిన చేసిన ధ్రువపత్రాలను ఈ వీడియోలో చూపించారు.
‘’మనం కొన్నిసార్లు మన పక్కన ఉన్న దాని కోసం ఎక్కడో దూరంగా వెతుకుతుంటాం. మేం స్నేహితులుగా జర్నీని స్టార్ట్ చేశాం. తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రేమలో పడ్డాం. ఫైనల్గా నా ప్రేమ దొరికింది” అంటూ స్వరా పేర్కొన్నారు.
అయితే ఈ నూతన వధూవరులకు..సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాగా, స్వరా తను వెడ్స్ మను, దాని సీక్వెల్ తను వెడ్స్ మను రిటర్న్స్, వీరే ది వెడ్డింగ్ సహా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇకపోతే ఫహద్ విషయానికొస్తే.. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడని సమాచారం.