సినిమా వాళ్ళపై రూమర్స్ రావడం కొత్తేం కాదు. నిప్పులేకుండా పొగరాదన్నది ఎంత వాస్తవమో, ఎంతో కొంత నిజం లేకుండా రూమర్ రాదన్నది కూడా అంతే వాస్తవమని ఎన్నో ఉదాహరణలు రుజువు చేసాయి. అయితే వీటిలో కొన్ని కల్పితాలు కూడా లేకపోలేదు. నిజానిజాలు పక్కనపెడితే స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మికల రిలేషన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ఓ వైపు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే తమకేం పట్టనట్లు ఇటీవల మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కెమెరాల కంట చిక్కిన ఈ జోడి.. మరోసారి దుబాయ్ వేదికగా ఫ్యామిలీతోకలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ దొరికిపోయారు.
ఈ మేరకు ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ట్విట్‌లో విజయ్ తన పేరెంట్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతోపాటు ఓ రెస్టారెంట్ దగ్గర విజయ్ ముందు నిలబడి స్మైల్ ఇస్తున్న రష్మిక కూడా కనిపించింది. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవగా.. ‘వీరిద్దరూ లవ్ బర్డ్సే అని కన్ఫర్మ్స్ అయింది’ అంటూ అభిమానులు చర్చిస్తున్నారు.
Virosh at Dubai #VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/VDfyNhlkel
— Rashmika VijayDeverakonda 💕 (@Rashmikavijay8) January 30, 2023