విజయ్ ఆంటోనీ సినిమాలనగానే అందరికీ ఓ విషయం గుర్తొస్తుంది. ఏ సినిమా వచ్చినా, ఆ మూవీకి సంబంధించి కొంత భాగాన్ని ముందే రిలీజ్ చేయడం ఈ హీరో స్టయిల్. బిచ్చగాడు తర్వాత చాలా సినిమాలకు ఇదే పద్ధతి పాటించాడు విజయ్ ఆంటోనీ. 4 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు సినిమాని ముందే రిలీజ్ చేసిన చరిత్ర ఇతడిది.
అయితే ఈమధ్య ఈ పద్ధతి నుంచి కాస్త జరిగాడు విజయ్ ఆంటోనీ. అందరిలా తను కూడా నేరుగా సినిమాల్ని విడుదల చేయడం మొదలుపెట్టాడు. అలా తన పాతపద్ధతికి దూరమైన ఈ హీరో, ఇప్పుడు మరోసారి ఓల్డ్ స్టైల్ లోకి మారాడు.
“బిచ్చగాడు” సీక్వెల్ గా “బిచ్చగాడు 2” రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ హీరోయిన్.
ఈ సినిమా నుండి మొదటి 4 నిమిషాల ఫుటేజ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రానుందని తెలుస్తోంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బిచ్చగాడు 2 చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.