విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఆ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇదిలా ఉండగా సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉండే విజయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డును సాధించాడు.
తన ఫాలోవర్స్ ను 14 మిలియన్ కు పెంచుకున్నాడు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తర్వాత అంతటి స్థాయిలో ఫాలోవర్స్ ను కలిగిన హీరో గా విజయ్ రికార్డ్ సృష్టించాడు. 2018 మార్చి లో విజయ్ ఇంస్టాగ్రామ్ లో జాయిన్ అయ్యాడు.