నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా తెలుగు ఓటి టి సంస్థ ఆహా లో అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో కు చాలా మంది సినీ స్టార్స్ వచ్చారు. మహేష్ బాబు సైతం ఈ టాక్ షో కు హాజరయ్యారు. అయితే ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించి ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.
త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ షో కు సంబంధించి బాలకృష్ణ విజయ్ దేవరకొండ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్య పంచే కట్టులో కనిపించారు.