ఎవరు ఏ సినిమాలు చేయాలో వారే చేయాలి… నేను బచ్చాగాడిని. ప్రభాస్ అన్న చేయాల్సిన సినిమా రేంజ్ హలీవుడ్ అంటూ కామెంట్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. హలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటించిన టెర్మినేటర్ డార్క్ ఫేట్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశాడు విజయ్. సాహో, సైరాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయిందని, తాను అలాంటి సినిమాల గురించి మరో 5 ఏళ్ల తర్వాత మాట్లాడుతా అంటూ చెప్పుకొచ్చారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్స్ ట్రై చేసే పనిలో బిజీగా ఉన్నాడట విజయ్.