సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై ఐమాక్స్ దగ్గర దాడికి యత్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసి రెచ్చిపోయారు. దాంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కత్తి మహేష్ పై దాడి చేసేందుకు యత్నించగా.. అక్కడికి వచ్చిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కొంతకాలంగా ఆయన సోషల్ మీడియాలో రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. రాముడి ఫేవరేట్ డిష్ నెమలి తొడ, జింక మాంసం అని.. సీత బంగారు జింకను తెమ్మన్నది తినడానికే అని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో కత్తి మహేష్ పై పలు పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. హిందువుల మనోభాలను కించపర్చితే సహించేది లేదంటూ రెండో రోజులుగా హిందుత్వ సంఘాలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల కారణంగానే దాడికి పాల్పడి ఉండవచ్చని అంటున్నారు.