విజయ్ దేవరకొండ… ఇప్పుడు సౌత్ సినిమాలో ఈ పేరు మారు మ్రోగుతుంది. ఇదేదో ఎవరో అన్న కామెంట్స్ కాదు. గూగుల్‌లో ఈ ఏడాది సౌత్ ఇండియా సినిమా ఫీల్డ్‌లో ఎవరి గురించి ఎక్కువగా వెతికారు అని అడిగితే వచ్చిన మాట. అవును… సౌత్ సినిమా ఇండస్ట్రీలో 2019 సంవత్సరంలో ఎక్కువగా అభిమానులు వెతికిన వ్యక్తి విజయ్ దేవరకొండ.
గూగుల్ ప్రతి సంవత్సరం అన్ని రంగాల్లో ఎక్కువగా ఎవరి కోసం వెతికారు అనే దానిపై ఈయర్ ఎండింగ్‌లో ఓ రిపోర్ట్ ఇస్తుంది. ఎంత ఫేమస్ పర్సన్ అనేది ఈ లిస్ట్ ప్రకారం ఓ అంచనాకు రావచ్చు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గూగుల్ రిలీజ్ చేసిన ఆ లిస్ట్‌లో సౌత్ సినిమా గురించిన వెతికిన వారిలో ఫస్ట్ ప్లేస్ విజయ్ దేవరకొండదేనని స్పష్టం చేసింది.
సౌత్ స్టార్స్‌లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన లిస్ట్‌లో….
1. విజయ్ దేవరకొండ
2. రష్మీక మందన
3. విక్టరీ వెంకటేష్
4.షాలినీ పాండే(అర్జున్‌రెడ్డి హీరోయిన్)
5.అక్కినేని నాగార్జున
ఎక్కువగా వెతికన మొదటి పది దక్షిణాది చిత్రాలు
1. సాహో
2.కేజీఎఫ్
3. కాంచన 3
4. విశ్వాసం
5.పెట్ట
6. బిగిల్
7.డియర్ కామ్రెడ్
8. ఇస్మార్ట్ శంకర్
9. వినయ విదేయ రామ
10. అసురన్