ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే… ఏదో ఒక దానిపై ఇన్వెస్ట్ చేయటం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ స్టైల్. ఇప్పటికే వస్త్ర వ్యాపారంలో ఉన్న దేవరకొండ ఇప్పుడు మల్టిప్లెక్స్ బిజినెస్ లోనూ అడుగుపెట్టనున్నారు.
ఏషియన్ సినిమాస్- విజయ్ దేవరకొండ కలిసి మహబూబ్ నగర్ లో ఓ మల్టిప్లెక్స్ నిర్మించారు. ఆ నిర్మాణం పూర్తి కావటంతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దసరా నుండి స్క్రీనింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏవీడీ సినిమాస్ పేరుతో ఈ మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.