తెలుగు సినిమా తెరపైకి వేగంగా దూసుకొచ్చి, అతి తక్కువ కాలంలోనే తనకో గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. చేసిన సినిమాల్లో కేవలం రెండంటే రెండు మాత్రమే హిట్. అందులోనూ కేవలం ఒక్క సినిమాలో మాత్రమే మెయిన్ రోల్. కానీ ఇంత త్వరగా ఏ హీరోకు, నటుడికి ఇంత పేరు రాలేదు. సరే… సినిమా ఫీల్డ్‌లో ఊహించని ఎదుగుదల ఇలాగే ఉంటుంది అనుకోవచ్చా…? లేదా విజయ్ దేవరకొండ వెనుక వెలమ రాజకీయం ఉందా…? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
అయితే విజయ్ దేవరకొండ బిజినెస్ చూస్తే ఆమాంతం పెరిగిపోయింది. చేసిన నాలుగు సినిమాలకే తెలుగు నుండి తమిళ్‌తో పాటు బాలీవుడ్ వరకు ప్రచారం తెచ్చుకున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా విజయ్ దేవరకొండ మల్టిప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంటరయినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో మూడు నుండి ఐదు స్క్రీన్లతో మల్టిప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాలను ప్రత్యేకంగా కేటీఆర్, ఇతర తెరాసా నాయకులు వీలైనప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అలానే జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవరకొండే బ్రాండ్ అంబాసిడర్.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేసిన వ్యక్తి మల్లిప్టెక్స్ నిర్మాణంలోకి అడుగుపెట్టడం, అదే సామాజిక వర్గానికి చెందిన వారు మీడియా బిజినెస్‌లోకి ఎంటరవటం కేవలం వెలమ అయినందునేని, మిగతా వారు ఎవరైనా ఇలా తెలంగాణలో ఇంత త్వరగా అభివృద్ధి చెందారా అని ప్రశ్నిస్తున్నారు. పైగా వీరంతా మంత్రి కేటీఆర్‌కు వీర విధేయులన్న విషయం అందిరకీ తెలిసిందేనంటున్నారు.