టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు. ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్, ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్, రౌడీవేర్ ఇలా పలు రకాల బిజినెస్ లను చేస్తున్న విజయ్… ఇప్పుడు థియేటర్ రంగంలోకి దిగాడు.
ఏ.వి.డి సినిమాస్ పేరుతో విజయ్ తన సొంత ఊరు మహబూబ్‌నగర్‌లో ఓ థియేటర్‌ని ఓపెన్ చేశాడు విజయ్ దేవరకొండ. మూడు థియేటర్స్ ను కలిపి నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ టాప్ క్లాస్ సినిమా అనుభవాన్ని ప్రేక్షకులకు అందించబోతుందట. డాల్బీ అట్మాస్, లగ్జరీ సీటింగ్ వంటి హంగులతో ఈ థియేటర్ ఉండనుందట.