లవ్ స్టోరీలకు, బోల్డ్ సీన్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇక లవ్ స్టోరీల జోలికి వెళ్లనంటూ సంచలన ప్రకటన చేశాడు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఈ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోనే ఎక్కువ కష్టపడ్డా. నలుగురు అందమైన హీరోయిన్లతో ఒకే సినిమాలో చేయటం అంటే కల నిజమయ్యే ఫీలింగ్ లాంటిది. కానీ నాకు తెలుసు ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ పిక్చర్ అంటూ కామెంట్ చేశాడు.
విజయ్ దేవకొండ సినిమా అంటే తెలంగాణ యాసతో పాటు బోల్డ్ కంటెంట్ ఎక్కువ. దేవరకొండ అనగానే అర్జున్‌రెడ్డి గెటప్ గుర్తుకొస్తుంది. దీంతో లవర్ బాయ్ ఇమేజ్‌తో ఎక్కువ రోజులు బండి నెగ్గుకు రావటం కష్టమనే భావనతోనే దేవరకొండ లవ్ ట్రాక్ నుండి సైడ్ అయినట్లు ఫిలింనగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ఫైటర్ మూవీతో దేవరకొండ తన లవ్ స్టోరీ హీరో ఇమేజ్‌ను మార్చుకోబోతున్నాడు. ఫైటర్‌గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న దేవరకొండ ఇక నుండి నటనతో పాటు మాస్ హీరో గెటప్‌తో పాటు యాక్షన్ సీన్స్ సినిమాలకు ఓకే చెప్పనున్నాడని టాక్ వినపడుతోంది.