విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఆనంద్ దేవరకొండ తన రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ అనంతోజు అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా పట్ల తాజాగా విజయ్ దేవరకొండ ఓ లెటర్ ని విడుదల చేశాడు. ఆ లెటర్ లో మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ పై విజయ్ ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ సినిమాలో డైలాగ్ రైటర్ జనార్ధన్ గురించి ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర పోషించిన గోపరాజు రమణ నటన గురించి, ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.
#MiddleClassMelodies ❤️ pic.twitter.com/PbnYLanq9h
— Vijay Deverakonda (@TheDeverakonda) November 22, 2020