చిత్ర పరిశ్రమ ఎన్నో నిర్మాణ సంస్థల్ని చూసింది. వాటిల్లో చాలా వరకు ఒక సినిమా అయిన తర్వాత మరోటి మొదలు కావడం సాధారణం.కానీ మైత్రీమూవీస్ సంస్థ అలనాటి ఏవీఎమ్, వాహినీ నిర్మాణ సంస్థలను తలపిస్తోంది.
ఒకే టైమ్ పిరీయడ్ లో మూడు నాలుగు సినిమాలు. విభిన్న కథాంశాలు, వివిధ భాషలు, విభిన్నమనస్తత్వాలున్నహీరోలు, దర్శకులతో చిత్రాలు నిర్మించి హిట్లు కొడుతున్నారు. క్రేజీ కాంబినేషన్స్ ట్రైచేస్తున్నారు. అలాంటి కాంబోలో విజయ్ దేవరకొండ- సమంత కాంబినేషన్ ఒకటి.
వీరిద్దరు జంటగా నటిస్తున్న తొలిచిత్రం ‘ఖుషి’. మరోవిశేషం ఏంటంటే ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేం దర్శకుడు శివ నిర్వాణ.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది మూవీటీమ్.
ఈ చిత్రాన్ని సెప్టెంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేయనుట్లు పేర్కొంది. ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది.
ఏంతో కూల్గా ఉన్న ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ ఆఫీస్‌కు వెళ్తూ.. టెర్రస్‌పై పెట్‌ను ఎత్తుకొని ఉన్న సమంతకు బై చెప్తున్న స్టిల్ను పోస్ట్ చేసింది.ఇది అభిమానులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతోంది.
ప్రస్తుతం ‘ఖుషి’ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లోనే జరుగుతోంది. కశ్మీర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంకా ఈ లవ్స్టోరీ సినిమాలో ఫైట్స్ కూడా ఉన్నాయట. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో వీటిని చిత్రీకరిస్తున్నారు.
మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వాహాబ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంకా ఈ మూవీలో మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, జయరామ్, మురళీ శర్మ, అలీ, లక్ష్మీ, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, శరణ్య ప్రదీప్ శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్నారు.