అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. మంచి సక్సెస్ రేటుతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నాడట. ఆ మధ్య దొరసాని మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్… విమర్శకుల ప్రశంసలు పొందినా, ఇంకాస్త మెరుగుపడాలన్న అభిప్రాయం వ్యక్తమయింది.
ఇప్పుడు ఆనంద్ దేవరకొండ శ్రీకాంత్ హీరోగా చేసిన తాళి సినిమాను రీమేక్ చేసిన పనిలో పడ్డారట. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా తాళి సినిమా కథను మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నిర్మించిన తాళి సినిమా అప్పట్లో మంచి విజయమే సాధించింది. మరీ విజయ్ లాగే ఆనంద్ చేస్తోన్న ఈ ఎక్స్‌పరిమెంట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.