టాలీవుడ్ వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ చూసిన ఓ ట్రైలర్ తనకు తెగ నచ్చేసిందట. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ గ్రూప్‌తో టైం స్పెండ్ చేస్తున్న విజయ్… ఆ ట్రైలర్ గురించి మాట్లాడుతూ నాకు బాగా నచ్చేసింది. నేను అలా నా జీవితంలో చేయలేను కేవలం చూసి ఆనందించటం తప్పా అంటూ ట్వీట్ చేశాడు.
ఇంతకీ విజయ్ చేయలేనిది… చూసి మాత్రమే ఆనందించేది ఏంటంటే విజయ్ దేవరొకండ స్ట్రీట్ డాన్సర్ అనే సినిమా ట్రైలర్‌ను చూశాడట. ఈ సినిమాలో డాన్స్‌లు చూసి అలా డాన్స్ చేయటం నా జీవితంలో కుదరని పని, కేవలం చూసి ఆనందిస్తా అంటూ ట్వీట్ చేసి… కింద ట్రైలర్‌ను కూడా పోస్ట్ చేశాడు. ఈ సినిమలో వరుణ్, శ్రద్ధాకపూర్, ప్రభుదేవా, రెమో డిసౌజ్‌లు నటిస్తుండగా వారందరికీ ఆల్‌ద బెస్ట్ చెప్పాడు విజయ్. ఈ చిత్రం రిపబ్లిక్ డే స్పెషల్‌గా జనవరి 26న దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
త్వరలో పూరీ జగన్నాథ్ కాంబినేషనలో ఫైటర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు డియర్ కామ్రెడ్ విజయ్.