విజయ్ దేవరకొండ… అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో. కానీ కొంత కాలంగా విజయ్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లో వరల్డ్ ఫేమస్ లవర్ కూడా చేరిపోయింది. అయితే విజయ్ కన్నా ముందు ఈ సినిమా సునీల్ చేయాల్సి ఉందట. త్రి-విక్రమ్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకొని, డైరెక్టర్ క్రాంతి మాధవ్ పోస్టర్ కూడా రెడి చేయించాడట.
కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుండి సునీల్ తప్పుకోవడం తో అప్పట్లో సునీల్ ఉంగరాల రాంబాబు సినిమా చేయగా, అర్జున్ రెడ్డి కన్నా ముందే విజయ్ ఈ సినిమాకు సైన్ చేసారని సమాచారం. ఇక ఈ మూవీలో క్లైమాస్ కూడా ఒరిజినల్ మూవీ క్లైమాస్ కాదట. స్టోరీలో కొన్ని మార్పులు చేద్దామంటూ డైరెక్టర్ క్రాంతి మాధవ్ చెప్పినా… విజయ్ ఒప్పుకోలేదట. ఇక ఈ సినిమా బిజినెస్ చివరి నిమిషం వరకు కాకపోవడంతో అంతా కంగారు పడ్డారట.
అంతేకాదు విజయ్ ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న ఫైటర్ మూవీ కూడా ఇప్పుడు ఒకే చేసింది కాదట. ఈ సినిమా కూడా మూడు సంవత్సరాల క్రితం విజయ్ సంతకం చేసాడట. దీనితో ఈ మూవీ పరిస్థితి కూడా అంతే అన్న కామెంట్స్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.