అర్జున్ రెడ్డి తో యూత్ లో మంచి ఫేమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తామని పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఆ పోస్టర్ లో విజయ్ ఓ అమ్మాయిని హత్తుకుని ఏడుస్తున్నాడు. లుక్ కూడా అర్జున్ రెడ్డి లానే గడ్డంతో మాస్ గా కనిపిస్తున్నాడు. మరి దర్శకుడు విజయ్ ని ఏ విధంగా చుపిస్తున్నాడో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. ఈ సినిమా విజయ్ సరసన రాశి ఖన్నా.. కేథరిన్ ట్రెసా.. ఐశ్వర్య రాజేష్.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.