ఈ లవర్ ప్రస్తుతానికి యావరేజ్ - Tolivelugu

ఈ లవర్ ప్రస్తుతానికి యావరేజ్

ప్రేమికుల రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో విజయ్ దేవకొండ సరసన నాలుగు హీరోయిన్ లు నటించారు. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ సెకండ్ ఆఫ్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. సగటు ప్రేక్షకుడి ఓపికని చంపేసే విదంగా దర్శకుడు సినిమా ను తెరకెక్కించాడు. సాంగ్స్ కూడా ఈ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. అది కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి.

దర్శకుడు సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ కాస్త ఎక్కువగా చూపించాలని ప్రయత్నించినప్పటికీ పండించటంలో నటి, నటులు ఫెయిల్ అయ్యారనిచెప్పాలి. సువర్ణ, శీనయ్య పాత్రలు బాగున్నాయి. నటన పరంగా ఈ జంట ఆకట్టుకుందనే చెప్పాలి.మరోవైపు రైటర్ గౌతమ్ గా విజయ్ కనిపిస్తాడు. తన జీవితం కష్టాలు, బాధలను పడుతూ లైఫ్ ని గడుపుతుంటాడు. ఆ పాత్రలో విజయ్ నటన పరంగా బాగానే చేశాడనే చెప్పాలి. సువర్ణ శీనయ్య క్యారెక్టర్ బాగున్నప్పటికీ, యామిని, గౌతమ్ క్యారెక్టర్ లు ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. పారిస్ తో తీసిన సన్నీ వేషాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

దర్శకుడు మాధవ్ డిఫ్రెంట్ స్టోరీతో వచ్చినప్పటికీ క్లైమాక్స్ లో అదే మూసపద్ధతిలో ఎండ్ పలుకుతాడు. విజయ్, రాశికన్నా, ఐశ్వర్య రాజేష్ లు యాక్టింగ్ పరంగా వదిగిపోయారు. ముల్టీఫ్లెక్ సినిమా కావటంతో కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. మరో వైపు విజయ్ దేవరకొండ ఇమేజ్ కాపాడాలే తప్ప సక్సెస్ కావటం కష్టమంటూ టాక్ వినిపిస్తుంది.. ఓవరాల్ గా సినిమాకు త్రీ రేటింగ్ ఇవ్వొచ్చని సినీ విశ్లేషకులు చెప్తున్నా మాట.

Share on facebook
Share on twitter
Share on whatsapp