విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లైగర్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఛార్మి తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మరో వైపు ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. తెలుగులో అనన్యకు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. అయితే గడిచిన పది రోజుల్లో తెలుగు సినిమాలు అన్ని కూడా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా విజయ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే సమయం వచ్చింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల కు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నట్లు చార్మి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.