బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని అప్పును తీర్చకుండా లండన్ పారిపోయిన విజయ్ మాల్యా తాజాగా వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
విజయ్ మాల్యా తన మాజీ స్నేహితుడైన ప్రముఖ క్రికెటర్ గేల్ తో సమావేశమయ్యాడు మాల్యా. ఆ తర్వాత తన ట్విట్టర్ హ్యాండిల్ లో చిత్రాలను పోస్ట్ చేశాడు. దీంతో ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రముఖ కరేబియన్ క్రికెటర్ క్రిస్ గేల్ తనకు మంచి స్నేహితుడని.. అతన్ని ఆర్సీబీ జట్టులోకి రిక్రూట్ చేసింది తానేనని చెప్పాడు మాల్యా. అప్పటి నుండి తమ మధ్య మంచి స్నేహం కుదిరిందన్నాడు.
ఇప్పుడు అతన్ని కలుసుకోవడం సంతోషంగా ఉందని తన ట్వీట్ కు ట్యాగ్ చేసి రాసుకొచ్చాడు. అయితే.. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.