లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధానపాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాస్టర్. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో తొలివారం 100 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మాస్టర్ సినిమా చేస్తున్న కలెక్షన్లు పట్ల అభిమానులు సైతం కాలర్ ఎగరేస్తున్నారు.