విజయ్ దళపతి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మాస్టర్. ఏప్రిల్ 9న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతున్నట్లు గతంలో వార్తలు కానీ చక్కెర్లు కొట్టాయి. కానీ విజయ్ అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా కావడంతో థియేటర్స్ ఓపెన్ కావడంతో మాస్టర్ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ క్లారిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు సంక్రాంతి కానుకగా జనవరి 13న మాస్టర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ డిసైడ్ అయ్యారట. ఈ మేర అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది