దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి మరోసారి సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే. వారసుడు సినిమా ఇలా కంప్లీట్ అయిన వెంటనే, అలా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లిపోయాడు విజయ్.
ఇదిలా ఉండగా, ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్రోమోను కట్ చేశారు. ఈ ప్రోమో ఎలా ఉందంటే.. యాజ్ ఇటీజ్ గా ఈ సినిమా టీజర్ కింద దాన్ని రిలీజ్ చేసేయొచ్చు. అంత పక్కాగా, అంత రిచ్ గా ఉంది ఆ ప్రోమో.
వీడియోలో ఓవైపు కత్తి చేస్తుంటాడు విజయ్, మరోవైపు చాక్లెట్ కూడా తయారుచేస్తుంటాడు. మధ్యలో పామును కూడా చూపిస్తుంటారు. మరోవైపు విలన్లు కార్ల కాన్వాయ్ తో విజయ్ దగ్గరకు వస్తుంటారు. అలా కత్తిని తయారుచేసిన విజయ్, దాన్ని నీళ్లలో ముంచకుండా, నేరుగా చాక్లెట్ లో ముంచుతాడు. కొంచెం టేస్ట్ చేసి బ్లడీ స్వీట్ అంటూ డైలాగ్ చెబుతాడు.
ఈ వీడియోను విడుదల చేస్తూ, దానికి లియో అనే టైటిల్ ను యాడ్ చేశారు. ఇలా విజయ్ కొత్త సినిమా టైటిల్ ను స్టయిలిష్ గా, డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.