ఝుమ్మంది నాదం సినిమా తో సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ తాప్సీ. మొదటి సినిమాతోనే నటన పరంగా తానేంటో నిరూపించుకున్న తాప్సి తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ఆ తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఒకవైపు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ తమిళ సినిమాలో లీడ్ రోల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.ఈ సినిమా కథ మొత్తం తాప్సి చుట్టూ తిరుగుతూనే ఉంటుందట .
మరోవైపు తెలుగు తమిళ భాషల్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. దీపక్ సుందరరాజన్ దర్శకునిగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జైపూర్ లో షూటింగ్ ప్రారంభం కానుందట.సింగిల్ షెడ్యూల్ లో నే సినిమా మొత్తం పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.